Tata Consultancy Services | టీసీఎస్ కీలక నిర్ణయం.. ఇకపై అంతా ఆఫీసుకు రావాల్సిందే..!
Tata Consultancy Services | ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ (Tata Consultancy Services) కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ వర్క్ పద్ధతికి (Hybrid Work Policy) స్వస్తి పలకాలని నిర్ణయించింది.
Tata Consultancy Services | ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ (Tata Consultancy Services) కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ వర్క్ పద్ధతికి (Hybrid Work Policy) స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా సమాచారం అందించినట్లు నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ 1 నుంచి వారంలో ఐదు రోజులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2020లో టీసీఎస్ వర్క్ ఫ్రం హోమ్ (Work From Home) పద్ధతిని అమల్లోకి తెచ్చింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో.. హైబ్రిడ్ వర్క్ పద్ధతికి అనుమతించింది. దీంతో చాలా మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తున్నారు. మిగిలిన రెండు రోజులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులంతా ఇకపై వారానికి ఐదు రోజులు కార్యాలయాలకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ సీఈవో, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పేరిట ఉద్యోగులకు ఇ-మెయిల్స్ వెళ్లినట్లు తెలిసింది. అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులంతా వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే అని అందులో స్పష్టం చేసింది.
Also Read..
Samantha | హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న సామ్.. వీడియో వైరల్
Donald Trump | దారినే ఆయన సరిగా గుర్తించలేరు.. బైడెన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

