Samantha | అగ్రకథానాయిక, టాలీవుడ్ సూపర్ స్టార్ సమంత (Samantha) ప్రస్తుతం హాలిడే ట్రిప్ (Holiday Trip)ను ఎంజాయ్ చేస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా సామ్.. కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘ఖుషి’, ‘సిటాడెల్’ తర్వాత సామ్ ఇతర ఏ చిత్ర షూటింగ్స్‌లోనూ పాల్గొనలేదు. అలాగే కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్ కూడా చేయలేదు. కమిట్మెంట్స్ ఇచ్చిన సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్‌లు కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తను ట్రావెలింగ్‌పై దృష్టిపెట్టింది. చిన్నప్పట్నుంచీ తను చూడాలనుకున్న ప్రదేశాలన్నింటినీ సరదాగా చుట్టి వచ్చే పనిలోపడింది.
ప్రస్తుతం సామ్ వరల్డ్ టూర్లో బిజీబిజీగా గడిపేస్తోంది. రెండు నెలల క్రితం ఇండోనేషియా బాలి వెళ్లిన సామ్.. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. ఆ తర్వాత అమెరికా వెళ్లింది. అక్కడ కొన్ని ప్రదేశాలను చుట్టేసింది. ఇప్పుడు ఆస్ట్రియా (Austria) టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ సైక్లింగ్ చేస్తూ సంతోషంగా గడిపింది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.
విజయ్ దేవరకొండ (Vijay deverakonda)తో కలిసి సమంత నటించిన ‘ఖుషి’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ అందుకున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. సామ్.. ఖుషితోపాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ (Citadel) అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటించింది. ఆ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Donald Trump | దారినే ఆయన సరిగా గుర్తించలేరు.. బైడెన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
Viral Video | లగ్జరీ ఆడీ కారులో వచ్చి.. ఆకు కూరలు అమ్మిన రైతు.. వీడియో