Amazon | ఇకపై ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే.. ఉద్యోగులకు అమెజాన్ గట్టివార్నింగ్
Amazon | దిగ్గజ ఇ- కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) తమ ఉద్యోగులకు (Employees) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులు ఇక ఇంటి వద్ద నుంచి కాకుండా వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. సంస్థ ఆదేశాలను పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
Amazon | దిగ్గజ ఇ- కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) తమ ఉద్యోగులకు (Employees) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులు ఇక ఇంటి వద్ద నుంచి కాకుండా వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. సంస్థ ఆదేశాలను పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ‘ఇక ఇంటి నుంచి పనిచేయడం కుదరదు. వారానికి కనీసం మూడు రోజులు తప్పకుండా ఆఫీసుకు రావాల్సిందే. ఇది సంస్థ నిబంధన. సంస్థ ఆదేశాలను పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వారిని ఉద్యోగం నుంచి తీసేయాల్సి వస్తుంది’ అని కంపెనీ అంతర్గత సమావేశంలో సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) హెచ్చరికలు జారీ చేశారు.
కాగా, అమెజాన్ సంస్థ తమ ఉద్యోగుల్ని ఆఫీసుకు రామని చెప్పడం ఇదేమీ మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. మే నెల నుంచి ఉద్యోగులు వారానికి 3 రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని సీఈవో కోరారు. అయితే, అప్పట్లో కొందరు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కొందరు ఆఫీసులకు వెళ్లకుండా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే గతంలో ఉద్యోగులను ఆఫీసులకు రావాలని అభ్యర్థించిన సీఈఓ.. ఇప్పుడు మాత్రం ఆఫీసుకు రావాల్సిందే అని గట్టి వార్నింగే ఇచ్చారు.
కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా మూడేళ్ల క్రితం పలు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గడంతో అన్ని కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తున్నాయి. అయితే, కొందరు ఉద్యోగులు సంస్థ ఆదేశాలను పెడచెవిన వేసుకోవడం లేదు. దీంతో పలు కంపెనీలు ఉద్యోగులకు గట్టి ఆదేశాలు జారీ చేస్తున్నాయి. వస్తే రండి లేదంటే.. మానేయండి అంటూ కరాఖండీగా చెప్పేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) కూడా తమ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందేనని.. రాని వారిని తొలగించేందుకు కూడా సంకోచించబోమని తేల్చి చెప్పింది. మరో సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) కూడా ఉద్యోగులకు ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. ఉద్యోగులు ఇకపై ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా అమెజాన్ తమ ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
Also Read..
Neeraj Chopra | ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఫిట్నెస్ సీక్రెట్ తెలుసా..?
Onam | ఓనం వేడుకల్లో సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

