Neeraj Chopra | ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఫిట్నెస్ సీక్రెట్ తెలుసా..?
Neeraj Chopra | క్రీడాకారులు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం వారు కఠిన ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఇష్టమైన ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. ఇతర క్రీడాకారులతో పోలిస్తే అథ్లెట్లు మరింత ఫిట్‌గా ఉండాలి. అథ్లెట్ల బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ (ఒంట్లో కొవ్వు నిల్వల శాతం) 10 శాతం లోపే మెయింటెన్ చేయాలి. ఇలా చేయడం చాలా కష్టతరం. అయితే భారత గోల్డెన్ బాయ్ (Indias Golden Boy), జావెలిన్ (Javelin Throw) ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా దాదాపు నాలుగేళ్లుగా శరీరాకృతిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇందుకోసం నీరజ్ చోప్రా ప్రత్యేక డైట్ ప్లాన్ పాటిస్తున్నాడు.
Neeraj Chopra | క్రీడాకారులు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం వారు కఠిన ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఇష్టమైన ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. కొవ్వు పదార్థాల జోలికి అస్సలు వెళ్లరు. ఎందుకంటే శరీరాకృతిలో వచ్చే మార్పులు వారి ప్రదర్శనను ప్రభావితం చేస్తాయి. అందుకే వారు డైట్ (Diet) విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అందుకే పండ్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకుంటుంటారు. అయితే ఇతర క్రీడాకారులతో పోలిస్తే అథ్లెట్లు మరింత ఫిట్‌గా ఉండాలి. అథ్లెట్ల బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ (ఒంట్లో కొవ్వు నిల్వల శాతం) 10 శాతం లోపే మెయింటెన్ చేయాలి. ఇలా చేయడం చాలా కష్టతరం.
అయితే భారత గోల్డెన్ బాయ్ (Indias Golden Boy), జావెలిన్ (Javelin Throw) ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా దాదాపు నాలుగేళ్లుగా శరీరాకృతిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. బాడీ ఫ్యాట్‌ను కంట్రోల్లో ఉంచుకుని మజిల్ గ్రోత్ కావడానికి నీరజ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందుకోసం నీరజ్ చోప్రా ప్రత్యేక డైట్ ప్లాన్ పాటిస్తున్నాడు. ఈ మేరకు నీరజ్ తన ఫిట్నెస్ సూత్రాలను తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో పంచుకున్నాడు.
నీరజ్ డైట్ ప్లాన్..
నీరజ్ తన రోజును జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లతో ప్రారంభిస్తానని తెలిపాడు. ఇక ఉదయం పూట తేలికపాటి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకుంటానని చెప్పాడు. మూడు లేదా నాలుగు గుడ్డు తెల్లసొనలు, రెండు బ్రెడ్డు ముక్కలు, ఒక కప్పు నిండా పప్పులు, పండ్ల ముక్కలు తీసుకుంటానని వివరించాడు. ఇక మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే.. అన్నం, పెరుగు, పప్పులు, గ్రిల్డ్ చికెన్, సలాడ్ తీసుకుంటానని వివరించాడు. ఇక భోజనం తర్వాత గ్యాప్‌లో, శిక్షణ సమయంలో పండ్లు, బాదంపప్పు తీసుకుంటానని చెప్పాడు. ఇక రాత్రివేళ భోజనం చాలా తేలిగ్గా ఉంటుందట. ఎక్కువగా సూప్, ఉడికించిన కూరగాయలు, పండ్లు రాత్రి భోజనం కింద తీసుకుంటానని చెప్పాడు నీరజ్. కాగా, నీరజ్ 2016 వరకూ కఠినమైన శాఖాహారిగా ఉండేవాడినని తెలిపాడు. ఆ తర్వాత శిక్షణకు మద్దతుగా తన డైట్లో మాసాంహారం చేర్చుకున్నట్లు తెలిపాడు. మాంసాహారాన్ని తినాల్సి వస్తే.. ఎక్కువగా గ్రిల్ చేసిన సాల్మన్ చేపలు తీసుకుంటానని వివరించాడు.
ఐక్యరాజ్యసమితి గుర్తించిన దాదాపు అన్ని దేశాలు పోటీపడే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో తీవ్రమైన పోటీని తట్టుకుని పతకం సాధించాలంటే ఆషామాషీ కాదు. అలాంటిది వరుసగా రెండేండ్ల పాటు ఫైనల్స్‌కు అర్హత సాధించడమే గాక పతకాలు సాధించిన ఘనుడు నీరజ్ చోప్రా. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం నెగ్గిన నీరజ్.. ఈ ఏడాది ఏకంగా స్వర్ణాన్ని ముద్దాడాడు. ఇప్పటి వరకు ఏ భారత అథ్లెట్‌కు సాధ్యం కాని ప్రపంచ చాంపియన్ హోదాను నీరజ్ అలవోకగా అందుకున్నాడు. సీనియర్ స్థాయిలో అన్ని మేజర్ టోర్నీలలో పసిడి గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.
Also Read..
Onam | ఓనం వేడుకల్లో సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా..
Naga Chaitanya | ఖుషి ట్రైలర్ రాగానే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయిన చైతూ..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

