Naga Chaitanya | టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya) విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట నాలుగేళ్లకే తమ వైవాహిక జీవితానికి స్వస్తిపలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే, ఈ జంట విడిపోయి రెండేళ్లు గడిచిపోయినప్పటికీ వీరి గురించి ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వీరిద్దరూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూనే ఉన్నారు.
తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. సామ్ నటించిన ‘ఖుషి’ (Kushi) చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. ఈ క్రమంలోనే థియేటర్లలో ‘ఖుషి’ ట్రైలర్స్‌ను ప్రదర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లో ఓ థియేటర్‌కు వెళ్లిన చైతూ.. మధ్యలో సామ్ చిత్ర ట్రైలర్‌ను చూసి అసహనానికి గురయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. చైతన్య ఇటీవలే కన్నడ సినిమా ‘బాయ్స్ హాస్టల్’ చిత్రాన్ని చూసేందుకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌కు వెళ్లాడని.. అక్కడ సినిమా మధ్యలో ‘ఖుషి’ ట్రైలర్ రాగానే అసహనానికి గురై అక్కడి నుంచి బయటకు వచ్చేశాడంటూ సోషల్ మీడియా, పలు వెబ్సైట్లలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
కాగా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ ఈ వార్తలపై స్పందించాడు. అందులో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ చెత్త వార్తలే అని కొట్టిపారేశారు. ‘అవన్నీ చెత్త వార్తలు. అందులో ఎలాంటి నిజం లేదు. కొన్ని తెలుగు వెబ్‌సైట్స్‌లో వచ్చిన రూమర్స్ నా దృష్టికి వచ్చాయి. వాటిని సరిచేయాల్సిందిగా ఇప్పటికే వాళ్లకు సూచించాను’ అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత నటించిన ఖుషి (Kushi) రిలీజ్ కు సిద్దంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న గ్రాండ్ లెవల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో పాటుగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లో నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సామ్ కాప్ గా కనిపించనుంది. ఈ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక చైతన్య.. చందూమొండేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చైతూ అంతర్జాతీయ సరిహద్దు జలాల వెంబడి పాకిస్థాన్ దళాలకు పట్టుబడ్డ శ్రీకాకులం మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీ చైతూ కెరీర్లోనే అత్యధికంగా రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ సమాచారం. ఈ చిత్రంలో సాయిపల్లవి, కీర్తిసురేశ్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Also Read..
US University | అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ప్రొఫెసర్ మృతి
Roja Selvamni | ఏపీ మంత్రి రోజా సెల్వమణి భర్తపై అరెస్ట్ వారెంట్ జారీ..! కారణం ఏంటంటే..?