Roja Selvamni | ఏపీ మంత్రి రోజా సెల్వమణి భర్తపై అరెస్ట్ వారెంట్ జారీ..! కారణం ఏంటంటే..?
Roja Selvamni | ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంజ్ జారీ అయ్యింది. పరువు నష్టం దావా కేసులో చెన్నై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2016లో ఓ తమిళ ఛానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఇందులో తనను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఓ సినీ ఫైనాన్షియర్ ఆరోపించారు.
Roja Selvamni | ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంజ్ జారీ అయ్యింది. పరువు నష్టం దావా కేసులో చెన్నై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2016లో ఓ తమిళ ఛానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఇందులో తనను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఓ సినీ ఫైనాన్షియర్ ఆరోపించారు. ప్రస్తుతం జార్జి టౌన్ కోర్టులో కేసు విచారణ నడుస్తోంది. విచారణ సమయంలో దర్శకుడు సెల్వమణి విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. దాంతో కోర్టు తాజా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే, ఇది నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కాగా.. సెల్వమణి ఇప్పుడు అరెస్టు వారెంట్ నుంచి తప్పించుకోవాలంటే.. కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
అయితే, ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయిస్తారా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో ముకుంద్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో అరెస్టయ్యారు. ఫైనాన్షియర్ బోద్రాపై ఇంటర్వ్యూలో సెల్వమణి పలు ఆరోపణలు చేశారు. దీంతో బోద్రా సెల్వమణితో పాటు అరుళ్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యాఖ్యలతో తన పరువుకు నష్టం వాటిల్లిందని పిటిషన్లో ఆరోపించారు. కొద్ది రోజులకు బోద్రా మరణించగా.. ఆయన తనయుడు గగన్ కోర్టులో కేసును కొనసాగిస్తున్నారు. 2016 నుంచి కేసు కొనసాగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Killer | ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. రూ.కోటి ఛాలెంజ్ విసిరిన సినిమా ఎలా ఉందంటే!
Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
Asthma | ఆస్తమా ఉన్నవారికి ఫ్లూ సమస్య వస్తే.. అది సాధారణం కాదు.. కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

