US University | అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ప్రొఫెసర్ మృతి
అమెరికాలో (US) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలోని (North Carolina) చాపెల్ హిల్‌లో (Chapel hill) ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో (University of North Carolina) ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
చాపెల్ హిల్: అమెరికాలో (US) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలోని (North Carolina) చాపెల్ హిల్‌లో (Chapel hill) ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో (University of North Carolina) ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఫ్యాకల్టీ మెంబర్ (ఫ్రొఫెసర్) మృతిచెందాడు (Shot dead). సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) వర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడిన దుండగుడు.. సైన్స్ భవనంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరెవరీకి గాయాలవలేదని తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కాల్పులకు పాల్పడింది అతడేనా లేదా అని తెలియాల్సి ఉంది. అనుమానితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని వర్సిటీ చాన్సలర్ కెవిన్ గుస్కివీజ్ (Chancellor Kevin Guskiewicz) చెప్పారు. కాగా, క్యాంపస్‌లో లాక్డౌన్ ఎత్తేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వర్సిటీలో కాల్పులు చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.

Law enforcement have Arrested the Suspect in University of North Carolina Shooting#ChapelHill #UNCShooting#UNC #NorthCarolina #shooting #breaking #chapelhill #Carolina #University #USA #Shotting #Firing
— Chaudhary Parvez (@ChaudharyParvez) August 29, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

