Karthikeya | తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని మామలుగా అంటుంటారు. అదే విధంగా హీరోల దగ్గరకి వచ్చే ప్రతీ స్క్రిప్ట్‌పైన వాళ్ల పేరు రాసుండాలని ఇండస్ట్రీలో అంటుంటారు. అలా ఒక హీరో చేతుల నుంచి ఇంకో హీరో చేతులకు మారిన కథలెన్నో ఉన్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్లు అయ్యాయి. మరి కొన్ని అల్ట్రా డిజాస్టర్లు అయ్యాయి. కాగా తాజాగా మెల్లమెల్లిగా బాక్సాఫీస్ దగ్గర పుంజుకుంటున్న బెదురులంక సినిమా కూడా చేతులు మారిన కథే. కిందటి శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. ఆ తర్వాతి రోజు నుంచి మౌత్ టాక్ పాజిటీవ్‌గా రావడంతో శని, ఆదివారాల్లో కుమ్మేసింది.
పైగా దీనికి గట్టి పోటీ ఇస్తుందనుకున్న గాండీవధారి తొలిరోజే నెగెటీవ్ రివ్యూలు తెచ్చుకుంది. ఇక కన్నడ బ్లాక్ బస్టర్ అంటూ రిలీజైన బాయ్స్ హాస్టల్ కూడా ఏమంత మంచి టాక్ తెచ్చుకోలేదు. దాంతో బెదురులంకకు బాగా కలిసొచ్చింది. ఉన్న సినిమాల్లో ఇదే కాస్త బెటర్‌గా ఉందంటూ జనాలు ఈ సినిమాకే ఓటేస్తున్నారు. దాంతో కలెక్షన్లు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కథతో రెండు ఏళ్లు ట్రావెల్ చేసిన ఓ కుర్ర హీరో చివరి నిమిషంలో తప్పుకున్నాడట. దాంతో దర్శకుడు క్లాక్స్ కార్తికేయను హీరోగా పెట్టి బంపర్ హిట్ తీశాడు.
ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరా అనుకుంటున్నారా? ఆయనెవరో కాదు హీరో నాగశౌర్య. దర్శకుడు క్లాక్స్ ఈ సినిమా కథను ముందుగా నాగశౌర్యకు చెప్పాడట. నాగశౌర్యకు కూడా కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాకుండా ఈ సినిమా క్లాక్స్, నాగశౌర్యతో రెండేళ్లు ట్రావెల్ చేశాడట. అయితే కారణాలేంటో తెలియదు కానీ ఈ సినిమా శౌర్యకు సెట్ కాదని వచ్చేశాడట. మరీ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కాకపోయినా.. నాగశౌర్య చేసుంటే మాత్రం ఆయనకు కూడా మంచి హిట్టొచ్చేది. ఇక చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కార్తికేయను హిట్టు వరించింది. కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తూ వస్తున్న కార్తికేయకు హిట్టు అందని ద్రాక్షలా అయిపోయింది. ఇక ఇన్నాళ్లకు ఓ మంచి హిట్టు కొట్టాడు.
ఈ వారం రీ-రిలీజ్లు గట్రా లేకపోతే సినిమా కలెక్షన్లు ఇంకా వేరే రేంజ్లో ఉండేవి. అయినా కానీ ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్ఫార్మ్ చేస్తుంది. రేపో మాపో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టనుంది. సినిమా చాలా హిలేరియస్‌గా ఉందని.. చివరి 20నిమిషాలైతే ఫుల్‌గా నవ్వేస్తామని అంటున్నారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.