Imran Khan | ఇమ్రాన్‌కు నెయ్యితో వండిన దేశీ చికెన్, మటన్.. జైలులో రాజభోగాలు అనుభవిస్తున్న మాజీ ప్రధాని
Imran Khan | అటాక్ జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజభోగాలు అనుభవిస్తున్నారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు మూడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. జైల్లో ఉన్న మాజీ ప్రధానికి జైలు అధికారులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. నెయ్యితో వండిన దేశీ చికెన్ (Desi Chicken), మటన్ (Mutton) అందిస్తున్నారు.
Imran Khan | అటాక్ జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజభోగాలు అనుభవిస్తున్నారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు మూడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పంజాబ్ ప్రావిన్సులో ఉన్న అటాక్ జైలు (Attock Jail )లో శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో ఉన్న మాజీ ప్రధానికి జైలు అధికారులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. నెయ్యితో వండిన దేశీ చికెన్ (Desi Chicken), మటన్ (Mutton) అందిస్తున్నారు.
ఇమ్రాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్, మాజీ ప్రధాని అయినందువల్ల ఆయన ప్రొఫైల్ స్థితిని
పరిగణనలోకి తీసుకుని అటాక్ జైలులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జైలు అధికారులు పాకిస్థాన్
సుప్రీంకోర్టు (Pakistan Supreme Court)కు తెలిపారు. మాజీ ప్రధాని జీవన స్థితిగతుల నివేదికను
సుప్రీంకోర్టు కోరిన తర్వాత జైలు పరిపాలన తరపున అటార్నీ జనరల్ కార్యాలయం సమర్పించిన నివేదికలో
ఈ విషయం వెల్లడైంది.
జైలులో అత్యంత సురక్షితమైన హై అబ్జర్వేషన్ బ్లాక్ నంబరు2లో ఇమ్రాన్ ఖాన్ ను ఉంచామని, ఆయన
కోరిక మేరకు వారానికి రెండు సార్లు దేశీ చికెన్, నెయ్యితో వండిన మటన్ అందిస్తున్నట్లు అధికారులు
నివేదికలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని జైలులో సురక్షితంగా ఉండేందుకు పంజాబ్‌కు చెందిన 53 మంది
జైలు సిబ్బందిని తాత్కాలికంగా మోహరించినట్లు తెలిపారు. ఆయన ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా
సీసీ కెమెరాల పొజిషన్ కూడా మార్చినట్టు వెల్లడించారు. మంచం, పరుపు, దిండు, కుర్చీ, ఏసీ, టేబుల్,
ప్రార్థన చాప, ఎయిర్ కూలర్, ఖర్జూరాలు, టిష్యూ పేపర్స్, కొత్తగా వెస్ట్రన్ టాయిలెట్, వాష్ బేషన్ సహా
వార్తాపత్రికతోపాటు ఇస్లామిక్ చరిత్ర పుస్తకాలు, పవిత్ర ఖురాన్ అందించామని అధికారులు సుప్రీంకోర్టుకు
సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
ఇటీవల పంజాబ్ జైళ్ల ఐజీ మియాన్ ఫరూక్ అటాక్ జైలును సందర్శించి ఇమ్రాన్ ఖాన్ కు అందిస్తున్న
సౌకర్యాలను పరిశీలించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వైద్య సదుపాయాలు అందించేందుకు
ఐదుగురు డాక్టర్లను నియమించారు. వారు ఒక్కొక్కరు ఎనిమిది గంటల పాటు పనిచేస్తున్నారు. ఆయనకు
ప్రత్యేకంగా ఆహారాన్ని అందిస్తున్నారు. వైద్యులు పరీక్షించిన తర్వాతే ఆయనకు ఆహారాన్ని అందిస్తున్నారు.
Also Read..
Naga Chaitanya | ఖుషి ట్రైలర్ రాగానే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయిన చైతూ..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

