China | మారని డ్రాగన్ వక్రబుద్ధి.. అరుణాచల్‌ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ తమవేనంటూ మ్యాప్ విడుదల చేసిన చైనా
చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్‌ను (Standard Map) రూపొందించింది.
బీజింగ్: చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్‌ను (Standard Map) రూపొందించింది. చైనా న్యాచురల్ రిసోర్సేస్ రూపొందించిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా (South Tibet) పేర్కొంది. ఇక 1962 వరకు కశ్మీర్లో భాగంగా ఉన్న అక్సాయ్ చిన్ను డ్రాగన్ దేశం ఆక్రమించుకున్నది. అప్పటి నుంచి ఈ భూభాగంపై భారత్, చైనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇక తైవాన్ (Taiwan), దక్షిణ చైనా సముద్రాలను (South China sea) కూడా చైనాలో భాగమేనని నూతన మ్యాచ్‌లో పేర్కొంది. దక్షిణ చైనా సముంద్రంలో అతిపెద్ద భాగంగా ఉన్న నైన్ డ్యాష్ లైన్‌ను (Nine-dash line) కూడా తమ ప్రాంతంగా చూపించుకున్నది. అయితే దీనిపై వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దేశాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.

కాగా, బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సరిహద్దు వివాదం సహా ద్వైపాక్షిక అంశాలపై సంప్రదింపులు జరిగాయని బీజింగ్ అధికారిక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్-చైనా సంబంధాల మెరుగుపడితే ఇరు దేశాలతో పాటు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయని జిన్‌పింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రపంచంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి, శాంతి, సుస్ధిరతకు ఇండో-చైనా సంబంధాల బలోపేతం మార్గం సుగమం చేస్తుందని అన్నారు. సరిహద్దు ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు సమస్యను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీతో జిన్‌పింగ్ స్పష్టం చేసినట్టు చైనా తెలిపింది.
దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగామోదీ,జిన్‌పింగ్ ముచ్చటించుకున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో అపరిష్కృత అంశాలపై ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కాగా, వారిద్దరిమధ్య చర్చలు జరిగి వారం కూడా గడవకవముందే అరుణాచల్, ఆక్సాయ్ చిన్ భూభాగాలు తమవేనంటూ చైనా మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Complaints | గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
Gangula Kamalakar | ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు : గంగుల కమలాకర్
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

