న్యూఢిల్లీ, మే 27: ఎన్ఎండీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు నమోదు చేసుకున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,482 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఇనుప ఖనిజం, పెల్లెట్లు అత్యధికంగా అమ్మకాలు నమోదు చేసుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9 శాతం ఎగబాకి రూ.7,497.17 కోట్లకు చేరుకున్నది.
వీటిలో ఇనుప ఖనిజం అమ్మకంతో రూ.6,350.49 కోట్ల నిధులు సమకూరగా, ఇతర మినరల్స్ విక్రయించడంతో రూ.662 కోట్ల నిధులు సమకూరాయి. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.