హైదరాబాద్, ఫిబ్రవరి 6: ఎన్ఎండీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.1,897 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,492.73 కోట్ల లాభంతో పోలిస్తే 29 శాతం ఎగబాకింది. కంపెనీ ఆదాయం 21 శాతం ఎగబాకి రూ.6,942.92 కోట్లకు చేరుకున్నది.