New GST Rates | ఆహార ఉత్పత్తులు.. ప్రభుత్వ సేవలన్నింటిపైనా జీఎస్టీ వడ్డింపులిలా.. 18 నుంచి అమలు
New GST Rates | ఆహార ఉత్పత్తులు మొదలు ప్రభుత్వ సేవలపై సోమవారం నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు అమల్లోకి రానున్నాయి.
New GST Rates | ఆహార ఉత్పత్తులు, పండ్లు మొదలు హోటల్ బుకింగ్, చెక్‌బుక్‌ల జారీ వరకు పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ వడ్డించాలని జీఎస్టీ 47వ కౌన్సిల్ భేటీ నిర్ణయించింది. పెంచిన జీఎస్టీ రేట్లు సోమవారం (జూలై 18) నుంచి అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి పన్నుల వ్యవస్థ నుంచి పలు వస్తువులకు కల్పించిన మినహాయింపులను ఎత్తేశారు. అన్ప్యాక్డ్, అన్‌లేబుల్డ్, అన్ బ్రాండెడ్ వస్తువులపై మాత్రం జీఎస్టీ మినహాయింపు కొనసాగుతుంది. ఇక కొత్తగా జీఎస్టీ అమల్లోకి వచ్చే వస్తువులు, భిన్నమైన శ్లాబ్‌లను తెలుసుకుందాం..
జీఎస్టీ వడ్డింపులు ఇలా
ప్రీ-ప్యాక్డ్ & లేబుల్డ్ మాంసం (శీతలికరించని), చేపలు, పెరుగు, పన్నీర్, తేనె, ఎండు చిక్కుళ్లు, గోధుమలు, తృణ ధాన్యాలు, బెల్లం, సెంద్రియ ఆహార వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ.
మామిడి గుజ్జుతోపాటు అన్ని రకాల మామిడి ఉత్పత్తులపై 12 శాతం. ఫ్రెష్ మామిడి పండ్లపై పన్ను మినహాయింపు.
బ్యాంకులు జారీ చేసే చెక్‌లు (విడి చెక్‌లు, చెక్‌బుక్)లపై 18 శాతం జీఎస్టీ.
రూ.1000 లోపు హోటల్ గది అద్దెపై 12 శాతం.
మ్యాప్‌లు, అట్లాస్తోపాటు చార్ట్‌లపై 12 శాతం
ఈ-వేస్ట్‌పై జీఎస్టీ ఐదు నుంచి 18 శాతానికి పెంపు.
ఎల్ఈడీ బల్బులు, సిరా, కత్తులు, బ్లేడ్లు, పవర్ డ్రైవెన్ పంప్స్, డెయిరీ మిషనరీపై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంపు.
తృణధాన్యాల మిల్లింగ్ యంత్రాలపై ఐదు నుంచి 18 శాతానికి పెంపు
సోలార్ వాటర్ హీటర్, ఫినిష్డ్ లెదర్ ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ
పెట్రోలియం స్పెసిఫైడ్ ఉత్పత్తులపై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంపు.
ప్రభుత్వ, స్థానిక అధికారులు ఇచ్చే కాంట్రాక్ట్ వర్క్ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ
కట్, పాలిష్డ్ వజ్రాలపై జీఎస్టీ 0.25 నుంచి 1.5 శాతానికి పెంపు.
రోప్‌వేల మీదుగా ప్రయాణికులు, వస్తువుల రవాణాపై ఐదు నుంచి 18 శాతానికి పెంపు.
ట్రక్, గూడ్స్ క్యారేజీల అద్దెపై జీఎస్టీ 12 శాతం నుంచి పెంపు.
జీఎస్టీ మినహాయింపు ఎత్తేసిన వస్తు సేవలివే..
రైలు ప్రయాణం, లగేజీ రవాణాపై పన్ను
గోదాముల్లో ఆహార వస్తువుల నిల్వపై జీఎస్టీ
ఆర్బీఐ, ఐఆర్డీఏ, సెబీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీఎస్టీఎన్పై జీఎస్టీ
(రిజిస్టర్డ్) వ్యాపార సంస్థలకు నివాసాల అద్దెపై జీఎస్టీ
ఐసీయూ మినహా దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగుల గది అద్దె రూ.5000 దాటితే ఐటీసీ లేకుండా ఐదు శాతం జీఎస్టీ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

