నూతన జీఎస్టీ రేట్ల అమలు షురూ : పలు ఆహారోత్పత్తులు, సేవల ధరలకు రెక్కలు!
పెరిగిన జీఎస్టీ రేట్లు సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడంతో పలు ఆహారోత్పత్తులు, వస్తువులు, సేవల ధరలు భారమయ్యాయి.
న్యూఢిల్లీ : పెరిగిన జీఎస్టీ రేట్లు సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడంతో పలు ఆహారోత్పత్తులు, వస్తువులు, సేవల ధరలు భారమయ్యాయి. ప్రీ ప్యాక్డ్, ప్యాకేజ్డ్ ఆహోరోత్పత్తులపై కస్టమర్లు అధిక మొత్తం చెల్లించాల్సి రాగా నిర్ధిష్ట వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు పెరగడంతో నిత్యావసరాల ధరలూ భగ్గుమంటున్నాయి. హోటల్ రూంలు, బ్యాంక్ సేవలు భారమయ్యాయి.
ఇక ప్యాక్ చేసి లేబుల్ వేసిన బియ్యం, గోధుమలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, బెల్లం, తేనె, సోలార్ వాటర్ హీటర్లపై 5 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు.
ఎలక్ట్రానిక్ వాహనాలపై జీఎస్టీ రేటు 5 శాతం తగ్గడం ఒక్కటే కొంత ఊరట కలిగిస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలకు అనుగుణంగా తాజా జీఎస్టీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

