హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో ప్రమోషన్ల ప్రక్రియంతా సర్వీస్ రూల్స్ ప్రకారమే కొనసాగుతున్నదని తెలంగాణ అ సిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రమోషన్లలో అవకతవకలు జరిగాయని కొనసాగుతున్న ప్రచారాన్ని ఖండించింది. అసోసియేషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. సర్వీస్ రూల్స్, డీపీసీ సిఫార్సుల ప్రకారమే ప్రమోషన్లు కొనసాగుతాయని వెల్లడించింది.