న్యూఢిల్లీ, అక్టోబర్ 28: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.106.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లోకి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.63.01 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. ఏడాది క్రితం రూ.5,305.38 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.6,695.37 కోట్లకు ఎగబాకింది.