న్యూఢిల్లీ, జనవరి 12: ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటిదాకా (ఏప్రిల్ 1 నుంచి జనవరి 11 వరకు) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 8.82 శాతం పెరిగి రూ.18.38 లక్షల కోట్లకుపైగా నమోదయ్యాయి. నెమ్మదించిన రిఫండ్స్తోపాటు, పుంజుకున్న కార్పొరేట్ పన్ను ఆదాయమే ఇందుకు కారణమని సోమవారం ఆదాయ పన్ను (ఐటీ ) శాఖ తెలియజేసింది.
కాగా, మునుపటితో పోల్చితే నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 12.4 శాతం ఎగిశాయని పేర్కొన్నది. ఈసారి రూ.8.63 లక్షల కోట్లుగా ఉన్నాయని వివరించింది. కార్పొరేటేతర పన్ను వసూళ్లు కూడా 6.39 శాతం వృద్ధి చెంది సుమారు రూ.9.30 లక్షల కోట్లుగా ఉన్నాయి.