Advance Tax | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.95 లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ వసూలయ్యాయి. అలాగే రూ.2.05 లక్షల కోట్లు రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది. క్రితం ఏడాది ఇదే సమయంలో చెల్లించిన దాంతో పోలిస్తే 56.49 శాతం అధికం.
ప్రస్తుతేడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 17 వరకు పన్ను వసూళ్లలో నికర వ్యక్తిగత ఆదాయ పన్ను 19 శాతం ఎగబాకి రూ.5.15 లక్షల కోట్లకు చేరుకోగా, కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 10.55 శాతం ఎగబాకి రూ.4.52 లక్షల కోట్లకు, సెక్యూరిటీస్ ట్రాన్సక్షన్ ట్యాక్స్ నుంచి రూ.26,154 కోట్ల ఆదాయం సమకూరింది.