హైదరాబాద్, డిసెంబర్ 12: నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. రూ.871 కోట్ల నిధుల సేకరణ కోసం కంపెనీ జారీ చేసిన షేర్ల కంటే 14 రెట్ల అధిక బిడ్డింగ్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో కంపెనీ 1,33,87,854 షేర్ల విక్రయానికి 18,68,94,592 షేర్ల బిడ్డింగ్ దాఖలయ్యాయి. అలాగే క్యూఐబీ 27.47 రెట్ల సబ్స్క్రిప్షన్ కాగా, నాన్-ఇనిస్టిట్యూషన్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు 2.31 రెట్ల బిడ్డింగ్లు వచ్చాయి.
ఇప్పటికే యాం కర్ పెట్టుబడిదారుల నుంచి రూ.260 కోట్లను సేకరించిన హైదరాబాదీ సంస్థ..ప్రైజ్ బాండ్ ధరను రూ.438-460 మధ్యలో నిర్ణయించింది. ఐపీవో ద్వారా సేకరించిన నిధుల్లో రూ.129 కోట్లను నూతన డయాలసిస్ క్లినిక్స్లను నెలకొల్పడానికి, మరో రూ.136 కోట్లను రుణాలను తీర్చడానికి కేటాయించనున్నట్టు ప్రకటించింది.