హైదరాబాద్, జూన్ 20 (నమసే ్తతెలంగాణ): అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణ అటవీశాఖ చేపడుతున్న కృషికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మౌస్‌డీర్ సంరక్షణ, బ్రీడింగ్, అడవుల్లోకి పునరావాసం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు నెహ్రూ జూ పార్ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికైంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో ఈ అవార్డును అందుకున్న దేశంలోని తొలి జూపార్గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్‌లో భాగంగా అందించే ఈ అవార్డుల కార్యక్రమం శనివారం న్యూఢిల్లీలో జరిగింది.
నెహ్రూ జూపార్ క్యూరేటర్ వసంత అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవీదళాల అధిపతి డా. సీ సువర్ణ, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వినయ్‌కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నారు. నామినేషన్ ప్రక్రియలో సహకరించి, తమకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒకరికీ జూ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. అవార్డు సాధించిన నెహ్రూ జూపార్ అధికారులు, సిబ్బందితోపాటు తెలంగాణ అటవీశాఖను రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు.