హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోల్ ఇండియాకు చెందిన సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ నుంచి రూ.6,828.94 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్డర్‌తో జార్ఖండ్‌లోని మైనింగ్ ప్రాజెక్టులో నుంచి బొగ్గు, ఓవర్‌బర్డెన్‌ను వెలికితీసి రవాణా చేయాల్సి వుంటుందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బీఎస్ఈకి అందించిన సమాచారం ఆధారంగా ఈ భారీ ఆర్డర్‌కు సంబంధించి సీసీఎల్ నుంచి లేటర్ అందుకున్నది. ఇందుకోసం సంస్థ.. 413.49 ఎం సీయూఎం విలువైన ఓవర్‌బర్డెన్, 233.325 మిలియన్ టన్నుల బొగ్గునును శివ్పూర్ సైట్ నుంచి సరఫరా చేయాల్సి వుంటుందని పేర్కొంది. అలాగే 139.995 మిలియన్ టన్నుల బొగ్గును లోడింగ్ చేయాల్సివుంటుంది.