హైదరాబాద్, మే 17: నాస్డాక్లో లిైస్టెన అంతర్జాతీయ టెక్నాలజీ సేవల సంస్థ లైటస్ టెక్నాలజీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్..హైదరాబాద్ కేంద్రస్థానంగా శ్రీ సాయి కేబుల్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. దేశీయ మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణలో మల్టీ సర్వీస్ ఆపరేటర్(ఎంఎస్‌వో) సేవలు అందిస్తున్న శ్రీ సాయి కేబుల్‌లో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆర్థిక వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం శ్రీ సాయి కేబుల్‌కు పది లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టిన లైటస్ టెక్నాలజీ..భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళకు విస్తరించేయోచనలో ఉన్నది. శ్రీ సాయి కేబుల్ కింద 6,500 మంది ప్రాంతీయ కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు.