న్యూఢిల్లీ, మే 19: మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. 2024-25లో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లు పెరిగి రూ.65.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఈక్విటీ, డెబిట్ మార్కెట్లు నిరుత్సాహంగా ట్రేడవుతుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను ఫండ్లలోకి తరలించడం వల్లనే ఆస్తులు భారీగా పెరుగుతున్నాయని ఆంఫీ పేర్కొంది. మార్చి 2024 నాటికి ఫండ్ ఆస్తుల విలువ రూ. 53.40 లక్షల కోట్లుగా ఉన్నది. ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య 5.67 కోట్లకు పెరిగారు. సిప్ పెట్టుబడులు 45.24 శాతం అధికమై రూ. 2.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి.