న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశీయ శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఆయన సంపద ఆరు శాతం తగ్గి రూ.9.55 లక్షల కోట్లకు పరిమితమైనప్పటికీ దేశీయ కుబేరుల జాబితాలో తిరిగి తొలి స్థానంలో నిలిచారని ఎం3ఎం హురున్ ఇండియా 2025 సంవత్సరానికిగాను విడుదల చేసిన సంపన్నవర్గాల నివేదికలో వెల్లడించింది.
గతేడాది రూ.11.6 లక్షల కోట్ల సంపదతో తొలిస్థానంలో నిలిచిన అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ఈసారికిగాను రూ.8.14 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. హెచ్సీఎల్ చైర్మన్ రోష్నీ శివ్ నాడార్ తొలిసారిగా మూడో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. రూ.2.84 లక్షల కోట్ల సంపదతో ఈ స్థానం లభించింది. సైరస్ పూనావాలా తన నాలుగో స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కుమార మంగళం బిర్లా(రూ.2.32 లక్షల కోట్లు), మొత్తంగా దేశీయ కుబేరుల సంపద విలువ రూ.167 లక్షల కోట్లకు ఎగబాకింది.