మరిన్ని అదానీ షేర్ల తనఖా
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రుణదాతల కోసం మూడు అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా చేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ ఎస్బీఐక్యాప్ ట్రస్టీ కంపెనీ తెలిపింది.
- ఆస్ట్రేలియా బొగ్గుగనిపై తీసుకున్న రుణం కోసం టాపప్: ఎస్బీఐ
ముంబై, ఫిబ్రవరి 11: అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రుణదాతల కోసం మూడు అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా చేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ ఎస్బీఐక్యాప్ ట్రస్టీ కంపెనీ తెలిపింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీలు తనఖా పెట్టినట్టు ఎస్బీఐక్యాప్ ట్రస్టీ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ తనఖా వివరాల్ని రాయిటర్స్ వార్తా సంస్థకు ఎస్బీఐ ప్రతినిధి వెల్లడిస్తూ అదానీ ఎంటర్ప్రైజెస్కు ఆస్ట్రేలియాలోని కార్మిచెల్ కోల్ ప్రాజెక్టు కోసం ఎస్బీఐ కల్పించిన 300 మిలియన్ డాలర్ల స్టాండ్బై లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) ఫెసిలిటీలో భాగంగా అదనపు కొలాటరల్గా మూడు గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా పెట్టినట్టు తెలిపారు.
షేర్ల పతనంతోనే చిక్కులు
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎస్బీఐ నుంచి పొందిన ఎల్సీ విలువకు 140 శాతం కొలాటరల్ కవరేజ్ ఉండేలా చూస్తారు. అంటే చెల్లించాల్సిన రుణానికి 140 శాతం విలువైన సెక్యూరిటీలను తనఖా చేయాలి. షేరు ధరలు పతనమైతే రుణంలో కొంత చెల్లింపు చేయమని, లేదా అదనపు షేర్లను తనఖా ఉంచమని బ్యాంక్లు రుణగ్రస్తుల్ని డిమాండ్ చేస్తాయి. తనఖా విలువలపై ప్రతీ నెలా బ్యాంకర్లు సమీక్షిస్తారు. దీని ప్రకారం ఎంటీఎం (మార్క్ టు మార్కెట్, సెక్యూరిటీల ప్రస్తుత మార్కెట్ విలువ) ఖాతాలో ఏ మాత్రం తగ్గుదల ఏర్పడినా రుణగ్రస్త సంస్థ టాప్ అప్ (అదనపు తనఖా) చేయాల్సి ఉంటుందని ఎస్బీఐ ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

