న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఒకప్పుడు ప్రతీకార సుంకాలను విమర్శించిన ధనిక దేశాలే ఇప్పుడు ఒకదానిపై మరొకటి ప్రతీకార సుంకాలను విధించుకుంటుపోతున్నాయని ట్రేడ్ వర్గాలు విమర్శిస్తున్నాయి.
గతంలో భారీగా వృద్ధిని నమోదు చేసుకున్న అమెరికా, చైనా దేశా ల మధ్య ప్రతీకార సుంకాల రచ్చ జరుగుతున్నదని, ఇది ఎంత వరకు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆయా వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతీకార సుంకాల విధింపుపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలుంటాయని ఆ వర్గాలు తెలిపాయి.