హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మరో నూతన కో-వర్కింగ్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు. అమీర్‌పేటలోని వాసవి ఎంపీఎం గ్రాండ్లో 5.5 లక్షల చదరపు అడుగుల్లో సుమారు 400 సీట్ల సామర్థ్యంతో తెచ్చిన ఈ కేంద్రాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ప్లగ్ అండే ప్లే కో-వరింగ్ డెస్లను ఏర్పాటు చేసే సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. వాణిజ్యవేత్త గిరీష్ మల్పానీ నెలకొల్పిన ‘వెల్వర్’ అనే సంస్థ గచ్చిబౌలిలో ఇప్పటికే ఒక కో-వరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, తాజాగా అమీర్‌పేటలో రెండో దాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. రూ.6 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు.