హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ) : అలెరియా ఏఐ(కృత్రిమ మేధస్సు)తో పన్నుల రాబడి పక్కదారి పట్టకుండా అరికట్టవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని ఆయన పేరొన్నారు. అలెరియా ఏఐ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో తన కార్యాలయంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌ను మంత్రి తిలకించారు. ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఈ టూల్‌ను ప్రభుత్వ విభాగాలకు అనుసంధానిస్తే రాబడిలో నష్టపోతున్న 30 శాతాన్ని తిరిగి పొందవచ్చని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. వివిధ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో అర్హులు మాత్రమే ప్రయోజనం పొందేలా అలెరియా ఏఐ సహాయ పడుతున్నదని వారు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో ఐబీటీ సీఈవో మన్సూర్ అలీ ఖాన్, అలెరియా సీఈవో ఎరిక్ లియాండ్రీ, ఇన్నోలాజిక్ సీఈవో శివ దొండపాటి తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ శివారుల్లో కొత్తగా మరో రెండు ఐటీ పారులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సచివాలయంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రముఖ కంపెనీలు ఇకడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అందుకే హైటెక్ సిటీ తరహాలోనే కొత్తగా మరో రెండు ఐటీ పారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. వీటిని ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి, నగర శివారుల్లో ఏయే ప్రాంతాలు ఇందుకు అనుకూలంగా ఉన్నాయో సంబంధిత యంత్రాంగం అధ్యయనం చేస్తున్నదని వివరించారు.
‘దావోస్‌లో మైనస్ 8 నుంచి 11 వరకు టెంపరేచర్ ఉన్నది. ఆ చలికి మేమంతా స్వెట్టర్లు వేసుకుంటే, చంద్రబాబు మాత్రం రెగ్యులర్ డ్రెస్‌లోనే ఉన్నారు. ఆయన ఆ వయసులోనూ ఎంతో ఫిట్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. నిజంగా ఆయన గ్రేట్’ అని శ్రీధర్‌బాబు కొనియాడారు. దావోస్ పర్యటన నుంచి వచ్చిన శ్రీధర్‌బాబు చిట్‌చాట్ చేస్తూ.. ఏపీకి గ్లోబల్ కెపాసిటీ ఉన్నదని, చంద్రబాబుతో మాట్లాడినప్పుడు ఆయన బ్రాడ్ మెంటాలిటీ తెలిసిందని పేర్కొన్నారు. ఏపీకి అపార వనరులు, అతి పెద్ద కోస్టల్ ఏరియా ఉన్నదని, పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. దావోస్‌లో ఏపీ ప్రభుత్వం అనేక ఎంవోయూలు చేసుకున్నదని, కానీ అకడ ప్రకటించకుండా గోప్యత పాటించారన్నారు. పెట్టుబడులు సాధించేందుకు బాబు చేసిన ప్రయత్నాలు అల్టిమేట్ అని మెచ్చుకున్నారు.