న్యూఢిల్లీ, జూన్ 7: బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థయైన మినీ మరో ఈవీ మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌గా మినీ కంట్రీమ్యాన్ ఈ జాన్ కూపర్ కేవలం 20 యూనిట్లు మాత్రమే దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ కారు ధర రూ.62 లక్షలుగా నిర్ణయించింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లు ఈ నెల 10 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పవాహ్ తెలిపారు.
కేవలం 8.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 462 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ కారుపై రెండేండ్ల పాటు అన్లిమిటెడ్ కిలోమీటర్లు వ్యారెంటీ కల్పిస్తున్నది. భద్రత ఫీచర్లను మెరుగుపరచడంలో భాగంగా ఈ కారు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, డైనమిక్ స్టేబిలిటీ కంట్రోల్, క్రాష్ సెన్సార్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, ఆటో స్టార్ట్/స్టాప్ బటన్వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.