న్యూఢిల్లీ, డిసెంబర్ 15: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త హెక్టార్ను పరిచయం చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది. ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత పెంచడంలో భాగంగా ఈ నూతన ఎంజీ హెక్టార్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు ప్రీమియం ఫీచర్లు, 14 ఇంచుల హెచ్డీ టచ్స్క్రీన్, స్మార్ట్ బూస్ట్ టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఏబీఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్ అండ్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.