Meta | ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) పలువురు ఉద్యోగులపై సీరియస్ అయ్యింది. ఫుడ్ వోచర్స్ (company food vouchers) సిస్టమ్‌ను మిస్యూజ్ చేసుకున్నట్లు గుర్తించిన సంస్థ.. సదరు ఉద్యోగులపై వేటు వేసింది.
లాస్ ఏంజిల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న సుమారు 24 మంది ఉద్యోగులు.. కంపెనీ ఫుడ్ వోచర్ సిస్టమ్‌ను (misuse of the meal credit system) దుర్వినియోగం చేశారు. ఈ మీల్ వోచర్స్‌తో ఉద్యోగులు టూత్‌పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, స్కాచ్ టేప్ వంటి గృహోపకరణాలతో పాటు ఆహారేతర (నాన్- ఫుడ్) వస్తువలైన వైన్ గ్లాస్ వంటివి కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన సంస్థ.. దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ఉద్యోగులు ఆఫీసు వేళల్లో భోజనానికి సంబంధం లేని వస్తువులను కొనుగోలు చేసి ఫుడ్ క్రెడిట్లను దుర్వినియోగం చేసినట్లు తేలింది.
ఉద్యోగుల తీరుపై సంస్థ సీరియస్ అయ్యింది. సదరు ఉద్యోగులను పిలిచి విచారించగా.. కిరాణా వస్తువులు, గృహోపకరణాల కోసం ఫుడ్ క్రెడిట్స్‌ను వినియోగించినట్లు అంగీకరించారు. దీంతో సంస్థ చర్యలకు ఉపక్రమించింది. దాదాపు 24 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
మెటాలో ఆగని ఉద్యోగాల కోతలు..
మరోవైపు మెటాలో ఉద్యోగుల కోతలు ఆగడం లేదు. మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్స్ కోసం పనిచేస్తున్న టీమ్‌లతో సహా మెటా వర్స్ అంతటా లే ఆఫ్స్‌ను ప్రకటించింది. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే విషయాన్ని మెటా వెంటనే వెల్లడించలేదు.
ఈ కోతల వల్ల కంపెనీలోని వివిధ టీమ్‌లు ప్రభావితమవుతాయని టెక్ క్రంచ్ నివేదిక తెలిపింది. దీర్ఘకాల వ్యూహాత్మక లక్ష్యాల కోసం కొన్ని టీముల్లో మార్పులు చేస్తున్నట్టు మెటా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి వేరే అవకాశాలను చూపించడానికి తాము తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెప్పారు. తమను ఉద్యోగం నుంచి తొలగించారని పలువురు మెటా ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో మెటా తన రియాల్టీ ల్యాబ్స్ విభాగం ఉద్యోగులను తొలగించింది.
Also Read..
Isha Foundation | ఈషా ఫౌండేషన్‌కు భారీ ఊరట.. ఆ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
Group-1 Aspirants | సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు.. సోమవారం విచారిస్తామన్న సీజేఐ
Birthday Party | బర్త్‌డే పార్టీకి పిలిచి బట్టలిప్పమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..