చెన్నై, జూన్ 16: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. మరోసారి ధరలు పెంచడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ నెల నుంచి మరోసారి ధరలను పెంచనున్నట్టు మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.
రూపాయితో పోలిస్తే యూరో విలువ తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడం వల్లనే ధరలను సవరించాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1.5 శాతం చొప్పున రెండుసార్లు(జనవరి, జూన్)ధరలను సవరించిన విషయం తెలిసిందే.