Indias Highest Taxpayer | అంబానీ, అదానీ, రతన్ టాటా కాకుండా.. దేశంలోనే అత్యధిక ట్యాక్స్ పేయర్ ఎవరో తెలుసా..?
Indias Highest Taxpayer | బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ పే చేస్తున్నారు. గతేడాది అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అక్షయ్ కుమారే.
Indias Highest Taxpayer | 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (Income Tax Return) దాఖలు గడువు సోమవారంతో (జులై 31) ముగిసింది. జులై 30 వరకు 6 కోట్ల ఐటీఆర్ లు దాఖలైనట్లు ఐటీ శాఖ (Income Tax Department) పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా ఆదాయపు పన్ను (Indias Highest Taxpayer) ఎవరు కడుతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అత్యధికంగా ఆదాయపు పన్ను కడతారని అందరూ అనుకుంటుంటారు. ముకేశ్ అంబానీ (Mukesh Ambani), గౌతమ్ అదానీ (Gautam Adani), రతన్ టాటా ( Ratan Tata) వంటి కుబేరులు దేశంలో ఎక్కువ ట్యాక్స్ పే చేస్తుంటారని భావిస్తుంటారు. అయితే దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టేది వీళ్లెవరూ కాదంట. ఓ బాలీవుడ్ స్టార్ హీరో అని తెలిసింది.
ఆదాయ పన్ను శాఖ అందించిన వివరాల ప్రకారం.. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ పే చేస్తున్నారు. గతేడాది అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అక్షయ్ కుమారే. 2022 లో అక్షయ్ రూ.29.5 కోట్ల ఆదాయపు పన్నును చెల్లించారు. ఆ ఏడాది తన వార్షిక ఆదాయాన్ని రూ.486 కోట్లుగా ప్రకటించారు.
కాగా, బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో అక్షయ్ ముందు వరుసలో ఉంటారు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్ ను కూడా అక్షయ్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ వంటి వాటి ద్వారా కూడా ఆయన భారీగానే ఆదాయాన్ని అర్జిస్తున్నారు. అక్షయ్ ఇంతకు ముందు కూడా అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ యాక్షన్ హీరో ఏకంగా రూ.25.5 కోట్ల ఆదాయపు పన్నును డిపాజిట్ చేశారు.
దేశంలోనే టాప్ ట్యాక్స్ పేయర్స్ లో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా వంటి పారిశ్రామిక దిగ్గజాల పేర్లు కాకుండా అక్షయ్ ఈ జాబితాలో నిలవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే పారిశ్రామిక వేత్తలకు వ్యక్తి గత ఆస్తులు తక్కువ.. అన్నీ కంపెనీల పేరిటే ఉంటాయి. అలాంటప్పుడు ఆదాయాలు కూడా అధికంగా వారివారి కంపెనీల వాటాగా వెళతాయి. దీంతో ఆయా కంపెనీలు వ్యక్తిగత ట్యాక్స్ కు బదులు కార్పొరేట్ ఆదాయపు పన్ను చెల్లిస్తాయి. ఈ కారణంతోనే దేశంలో అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కుమార్ నిలిచారు.
Also Read..
Delhi services bill | ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళన
Sidhu Moose Wala | మూసేవాలా హత్య కేసులో మరో కీలక నిందితుడిని భారత్ కు తీసుకొచ్చిన అధికారులు
Elon Musk | మస్క్ కు షాక్.. ఎక్స్ ప్రధాన కార్యాలయంపై ఉన్న X లోగో తొలగింపు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

