Elon Musk | మస్క్ కు షాక్.. ఎక్స్ ప్రధాన కార్యాలయంపై ఉన్న X లోగో తొలగింపు
Elon Musk | ‘ఎక్స్’ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కు శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అధికారులు షాకిచ్చారు. నగరంలోని ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను తొలగించారు.
Elon Musk | ‘ఎక్స్’ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కు శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అధికారులు షాకిచ్చారు. నగరంలోని ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో నగర యంత్రాంగం లోగోను తొలగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) నివేదించింది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ను సూపర్ యాప్ గా మార్చే క్రమంలో దాని పేరును సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ‘X’ గా మార్చిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ పిట్ట స్థానంలోకి ‘X’ లోగో వచ్చి చేరింది. ఇందులో భాగంగా పేరు మార్చిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ ప్రధాన కార్యాలయంపై ‘X’ లోగోను ఏర్పాటు చేశారు. అయితే, ప్రధాన కార్యాలయంపై ఆ లోగో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఎక్స్ లోగో కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని నగర వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు (Neighbours Complain).
ఎక్స్ లోగో డిస్ ప్లేలో అమర్చిన ప్రకాశవంతమైన లైట్ల కారణంగా రాత్రిళ్లు ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి పడుతోందని తెలిపారు. దీంతో తమ నిద్రకు ఆటంకం కలుగుతోందని 24 మంది స్థానికులు నగర యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆలోగోను తొలగించినట్లు శాన్ ఫ్రాన్సిస్కో భవనాల తనిఖీ విభాగం అధికారి పాట్రిక్ హన్నన్ తెలిపారు.
‘X’ లోగోపై తమకు 24 మంది ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్థానికుల ఫిర్యాదుతో లోగో ఏర్పాటును సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా దాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్ధారించామని ఆయన వెల్లడించారు. దీంతో లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read..
Rahul Gandhi | ఆజాద్ పూర్ మండీని సందర్శించిన రాహుల్.. కూరగాయల ధరల గురించి ఆరా తీసి
Ukraine | జెలెన్ స్కీ స్వస్థలంపై రష్యా ప్రతీకార దాడి.. చిన్నారి సహా ఆరుగురు మృతి
Joe Biden | షర్ట్ లేకుండా బీచ్ డేని ఆస్వాదిస్తున్న అమెరికా అధ్యక్షుడు.. పిక్ వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

