Joe Biden | షర్ట్ లేకుండా బీచ్ డేని ఆస్వాదిస్తున్న అమెరికా అధ్యక్షుడు.. పిక్ వైరల్
Joe Biden | సూటూ, బూటుతో నిత్యం ఎంతో హుందాగా కనిపించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. తాజాగా షర్ట్ లేకుండా (Shirtless) దర్శనమిచ్చారు.
Joe Biden | సూటూ, బూటుతో నిత్యం ఎంతో హుందాగా కనిపించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. తాజాగా షర్ట్ లేకుండా (Shirtless) దర్శనమిచ్చారు. బేస్ బాల్ క్యాప్ (Baseball Cap), కళ్లకు సన్ గ్లాసెస్ (Aviators) ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తోంది.
80 ఏళ్ల బైడెన్ డెలావర్ (Delaware)లోని రెహోబోత్ (Rehoboth) వద్ద ఉన్న బీచ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కాసేపు బీచ్ లో సరదాగా సమయాన్ని గడిపారు. తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి.. షర్ట్ లేకుండా బీచ్ లో ఎంజాయ్ చేశారు. అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ అద్యక్షుడి ఫొటోలను క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘రెహోబోత్ బీచ్ లో ప్రెసిడెంట్ అద్భుతమైన బీచ్ డే ను ఆస్వాదిస్తున్నారు’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.
కాగా, దేశాధినేతలు ఇలా డిఫరెంట్ లుక్ లో కనిపించడం కొత్తేమీ కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin) కూడా 2009లో బీచ్ లో హార్స్ రైడ్ కు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్ కూడా ఇలానే షర్ట్ లేకుండా కండలు తిరిగిన శరీరంతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సైతం.. ఇలాంటి ఫొటోనే ఒకటి షేర్ చేశారు. అయితే అది మార్ఫింగ్ ఫొటో. తాను అందరి కంటే బలవంతుడిని అని చెప్పేలా.. హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలిన్ బాడీకి తన తలను తగిలించిన ఫొటోను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పట్లో ఆ ఫొటో ఓ సెన్సేషన్ అయ్యింది.
Also Read..
Lanka Premier League: మైదానంలోకి పాము.. నాగిని మళ్లీ వచ్చిందన్న దినేశ్ కార్తిక్
Parenting Tips | ఆఫీసుకెళ్తే బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలి? ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా?
Shobu Yarlagadda | బాహుబలి ప్రొడ్యూసర్‌కు కోపం తెప్పించిన ఆ యంగ్ హీరో ఎవరు?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

