Parenting Tips | ఆఫీసుకెళ్తే బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలి? ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా?
Parenting Tips | మంచి ప్రశ్నే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం ప్రతి బిడ్డకు ఆరునెలలు నిండేవరకూ తల్లిపాలే శ్రేయస్కరం. అదే సంపూర్ణ ఆహారం కూడా. అందులో అన్ని రకాల పోషకాలూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లను అరికట్టే శక్తి వాటికి ఉంది. బుద్ధిబలమూ పెరుగుతుంది.
Parenting Tips | నాకు నాలుగు నెలల పాప ఉంది. డాక్టర్ల సూచన ప్రకారం.. చనుబాలే ఇస్తున్నాను. తను చక్కగా ఎదుగుతున్నది. చురుకుగా ఉంటున్నది. ఇకనుంచీ నేను ఆఫీసుకు వెళ్లాలి. అప్పుడు కూడా పాలు ఇవ్వగలనా? లేదంటే, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలా?
ఓ పాఠకురాలు
మంచి ప్రశ్నే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం ప్రతి బిడ్డకు ఆరునెలలు నిండేవరకూ తల్లిపాలే శ్రేయస్కరం. అదే సంపూర్ణ ఆహారం కూడా. అందులో అన్ని రకాల పోషకాలూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లను అరికట్టే శక్తి వాటికి ఉంది. బుద్ధిబలమూ పెరుగుతుంది. మీరు చెబుతున్న సమస్య నవతరం తల్లులు ఎదుర్కొంటున్నదే. చాలామంది ఆఫీసుకు వెళ్లడం మొదలుకాగానే.. బిడ్డకు పాలివ్వడం ఆపాల్సి వస్తుంది.
డబ్బా పాలు అలవాటు చేయాల్సి వస్తుంది. ఇది క్షేమకరం కాదు. ఆఫీసుకు వెళ్లేముందు, ఆఫీసు నుంచి రాగానే.. పాలివ్వడం అలవాటు చేసుకోండి. తగిన ఏర్పాట్లు చేసుకుంటే ఆఫీసుకు వెళ్లినా తల్లిపాలు ఇవ్వగలరు. మీ చనుబాలను తీసి, శుభ్రమైన సీసాలో పోసి ఫ్రిజ్‌లో భద్రపరచండి. ఇరవై నాలుగు గంటల్లోపు వీటిని వాడుకోవచ్చు. సీసా మీద సమయం, తేదీ రాసుకుంటే సరిపోతుంది. ఫ్రిజ్‌లోంచి తీసిన పాలు గది వాతావరణానికి చేరుకున్నాక బిడ్డకు పట్టించవచ్చు.
మీ ఆఫీసు ఇంటికి దగ్గర్లోనే ఉంటే.. మధ్యాహ్నం పూట బిడ్డను ఎవరైనా అక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉందేమో చూడండి. అనుమతి తీసుకుని మధ్యలో మీరూ ఇంటికి వచ్చి వెళ్లొచ్చు. ప్రసవం తర్వాత ఆరునెలలు ఉద్యోగానికి సెలవు తీసుకునే వెసులుబాటూ ఉంది. ప్రభుత్వం కూడా తల్లిపాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ఆగస్టు మొదటివారాన్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకొంటారు. ‘ఎనేబిలింగ్ బ్రెస్ట్ ఫీడింగ్.. మేకింగ్ ఎడిఫరెన్స్ ఫర్ వర్కింగ్ పేరెంట్స్’ అనేది ఈ ఏడాది నినాదం. పాలివ్వడం తల్లి హక్కు. తల్లిపాలు అందుకోవడం బిడ్డ హక్కు. ఆ ఇద్దరి హక్కులకూ భద్రత కల్పించడం సమాజం బాధ్యత.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

