Ukraine | జెలెన్ స్కీ స్వస్థలంపై రష్యా ప్రతీకార దాడి.. చిన్నారి సహా ఆరుగురు మృతి
Ukraine | తమ దేశంపై ఎదురు దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడులను ఉధృతం చేసింది. అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) స్వస్థలమైన సెంట్రల్ ఉక్రేనియన్ నగరమైన క్రివి రిహ్ ( Kryvyi Rig) పై సోమవారం ఉదయం రెండు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Ukraine | రష్యా (Russia) దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఉక్రెయిన్ (Ukraine).. ఇప్పుడు ప్రత్యర్థి దేశంపై ఎదురు దాడికి దిగుతోంది. మాస్కోపై రివర్స్ అటాకింగ్ మొదలు పెట్టింది. ఇంతకాలం తమ దేశ భూభాగంపై అడుగు పెట్టడానికి యత్నించిన రష్యా సేనలను తిప్పికొడుతోంది. తగినన్ని ఆయుధాలు సమకూరడంతో వాటిని మాస్కోపై ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగా రాజధాని మాస్కోపై ఆదివారం డ్రోన్ల దాడి చేసింది. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎదురుదాడిని రష్యా నిర్వీర్యం చేస్తోంది.
ఈ మేరకు తమ దేశంపై ఎదురు దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడులను ఉధృతం చేసింది. అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) స్వస్థలమైన సెంట్రల్ ఉక్రేనియన్ నగరమైన క్రివి రిహ్ ( Kryvyi Rig) పై సోమవారం ఉదయం రెండు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రేనియన్ అంతర్గత మంత్రి ఇగోర్ క్లైమెంజో టెలిగ్రామ్ ద్వారా తెలిపారు. ఓ అపార్ట్ మెంట్ లో నాలుగు, తొమ్మిది అంతస్తుల మధ్య ప్రాంతాన్ని క్షిపణి దారుణంగా దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. అపార్ట్ మెంట్ లోని పలు ఫ్లాట్స్ దెబ్బతిన్నాయని, మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసినట్లు తెలిపారు. పౌరుల నివాసాలపై దాడి చేయకూడదన్న సంప్రదాయం ఉన్నప్పటికీ, దాన్ని రష్యా ఉల్లంఘించిందని ఆరోపించారు.
Also Read..
Joe Biden | షర్ట్ లేకుండా బీచ్ డేని ఆస్వాదిస్తున్న అమెరికా అధ్యక్షుడు.. పిక్ వైరల్
ED Raids | హైదరాబాద్‌లో ఈడీ దాడులు.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Kryvyi Rig
- Russia
- Ukraine
- Zelensky
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

