Deepika Padukone Bikini Photo | ఆ మధ్య పఠాన్ సినిమాలోని బేషరమ్ సాంగ్‌లో బికినీ అందాలతో దీపికా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ పాట రిలీజైన కొన్ని నిమిషాల్లోనే మిలియన్లలో వ్యూస్ కొల్లగొట్టింది. ఆ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం దీపికా హ్యాంగోవర్లో మునిగిపోయింది. నిజానికి పఠాన్ సినిమాపై అంత హైప్ రావడంలో ఆ పాట కూడా ముఖ్య పాత్ర పోషించిందనడంలో సందేహమే లేదు. నెవర్ బిఫోర్ అనే రేంజ్లో దీపికా బికినీలో దర్శనమిచ్చి యూత్‌కు పిచ్చెక్కిచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొడుతుంది ఈ హాట్ బ్యూటీ.
తాజాగా దీపికా తన ఇన్‌స్టాలో బ్లాక్ కలర్ బికినీ వేసుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. వన్స్ ఎపాన్ టైమ్.. నాట్ లాంగ్ ఎగో అనే క్యాప్షన్ పెట్టి ఫోటోను అభిమానులతో పంచుకుంది. దీనిపై దీపికా భర్త, రణ్వీర్ సింగ్ ‘ముందే ఓ వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుండేదంటూ’ కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఆ బికినీ ఫోటో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ది హాట్టెస్ట్ ఫైర్ అంటూ పలువురు నెటిజన్లు ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. నటి బిపాసా బసు సైతం ఫైర్ అనే ఎమోజీ పెట్టింది.
ఇక దీపికా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. ప్రభాస్ కల్కీతో పాటు ఫైటర్ సినిమా చేస్తుంది. షారుఖ్ నటించిన జవాన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. ఇప్పటికే రిలీజైన జవాన్ టీజర్లో ఓ రెండు సెకండ్ల పాటు కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో దీపికా పాత్ర ఎమైయ్యుంటుందా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.