Meesho | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రస్తుత పండుగ సీజన్లో మరో ఈ-కామర్స్ సంస్థ మీషో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వీరిలో అత్యధిక మంది తృతీయ శ్రేణి పట్టణాల్లో ఈ నియామకాలు ఉంటాయని పేర్కొంది.
ముంబై, సెప్టెంబర్ 5: స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టపోవడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో చివర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.