హైదరాబాద్, జూన్ 15: రాష్ట్రంలోని చిన్న వ్యాపారులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో పెద్ద ప్రయోజనాన్నే అందిస్తున్నది. తెలంగాణలోని దాదాపు 17వేల వ్యాపారులు మీషోలో నమోదు చేసుకున్నట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది. దీంతో జీరో కమీషన్ సదుపాయం వల్ల వీరంతా ఆకర్షణీయమైన ప్రయోజనం పొందుతున్నట్టు చెప్పింది.
గత రెండేండ్లలో మీషోపై వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, గత ఏడాది 20 శాతం పెరుగుదల కనిపించినట్టు పేర్కొన్నది. ఇక హోం, కిచెన్, వ్యక్తిగత సంరక్షణ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వస్తూత్పత్తులకు డిమాండ్ బాగున్నట్టు వెల్లడించింది. చిన్నచిన్న పట్టణాల నుంచీ ఆదరణ లభిస్తున్నట్టు వివరించింది.