Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల్లోని టాప్ 10 కంపెనీల్లో నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.96,605.66 కోట్లు కోల్పోయాయి. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) భారీగా నష్టపోయాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) లాభ పడ్డాయి. టాప్-10 సంస్థల్లో మిగతా ఆరు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.82,861.16 కోట్లకు పెంచుకున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 37,025.46 కోట్లు పతనమై రూ.13,37,919.84 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్య్రాప్ రూ.29,324.55 కోట్ల నష్టంతో రూ. 8,93,378.50 కోట్ల వద్ద స్థిర పడింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.24,856.26 కోట్లు కోల్పోయి రూ.14,83,144.53 కోట్లకు పరిమితమైంది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ. 5,399.39 కోట్ల పతనంతో రూ.7,08,168.60 కోట్లకు చేరుకున్నది.
మరోవైపు, రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.41,138.41 కోట్ల వృద్ధితో రూ.16,93,373.48 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.15,331.08 కోట్లు పెరిగి రూ.5,65,194.18 కోట్లకు చేరుకుంది. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13,282.49 కోట్లు పెరిగి రూ.5,74,689.29 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.9,031.19 కోట్లు వృద్ధి చెంది 8,04,834.34 కోట్ల వద్ద ముగిసింది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,878.63 కోట్లు పెరిగి రూ.6,03,064.44 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయి టెల్ ఎం-క్యాప్ రూ.199.36 పెరిగి రూ.9,10,934.58 కోట్లకు సరిపెట్టుకుంది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్ టెన్ సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీశ్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంకు, హిందూస్థాన్ యూనీ లివర్ నిలిచాయి.