Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో మూడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.06 లక్షల కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా లబ్ధి పొందాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ గతవారం 217.13 పాయింట్లు (.028 శాతం) వృద్ధి చెందింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,06,125.98 కోట్లు పుంజుకున్నది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారతీ ఎయిర్ టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,056.69 కోట్లు నష్టపోయింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.52,091.56 కోట్లు వృద్ధి చెంది రూ.12,67,056.69 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.36,118.99 కోట్లు పుంజుకుని రూ.8,13,914.89 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.17,915.43 కోట్లు పెరిగి రూ.6,35,945.80 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,271.31 కోట్ల నష్టంతో రూ.19,66,686.57 కోట్లకు చేరుకున్నది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.27,260.74 కోట్ల పతనంతో రూ.6,47,616.51 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.14,357.43 కోట్ల నష్టంతో రూ.5,23,858.91 కోట్ల వద్ద ముగిసింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.8,321.6 కోట్ల నష్టంతో రూ.13,111.45 కోట్ల వద్ద నిలిచింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,904.95 కోట్ల పతనంతో రూ.5,73,617.46 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.7,261.72 కోట్ల నష్టంతో రూ.8,04,262.65 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.3,391.35 కోట్ల నష్టంతో రూ.7,46,454.54 కోట్ల వద్ద ముగిసింది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, ఇన్పోసిస్, హెచ్యూఎల్, ఐటీసీ నిలిచాయి.