న్యూయార్క్ : ఆర్ధిక మందగమనం, మాంద్య భయాలు వెంటాడుతుండటంతో కార్పొరేట్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్‌కు (Massive Layoffs) తెగబడుతున్నాయి. టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకూ అన్ని కంపెనీలూ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇక లేటెస్ట్గా అమెరికాలోని డెట్రాయిట్ కేంద్రంగా పనిచేసే మల్టీనేషనల్ ఆటోమోటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ జనరల్ మోటార్స్ భారీ లేఆఫ్స్‌ను ప్రకటించింది.
అరిజోనా, మిచిగాన్, జార్జియా, టెక్సాస్ ప్లాంట్స్‌లో పనిచేసే 940 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఆటోమోటివ్ దిగ్గజం వెల్లడించింది. వ్యయనియంత్రణ చర్యలతో పాటు ఉద్యోగుల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా లేటెస్ట్ లేఆఫ్స్‌కు జనరల్ మోటార్స్ మొగ్గుచూపింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కొన్ని వందల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఆటో దిగ్గజం మరోసారి లేఆఫ్స్ బాటపట్టింది. ఇక అరిజోనాలో సాఫ్ట్వేర్-డిఫైన్డ్ వాహన బృందాల్లో పనిచేసే దాదాపు 90 మంది ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని జనరల్ మోటార్స్ పేర్కొంది. మిచిగాన్, జార్జియా, టెక్సాస్ ప్లాంట్లలో ఐటీ కార్యకలాపాల స్ధిరీకరణకు కంపెనీ యోచిస్తోంది. లేఆఫ్స్‌లో బాధిత ఐటీ ఉద్యోగులు ఇతర రాష్ట్రాల్లో ఓపెన్ పొజిషన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
Read More :
TVS Showroom | విజయవాడలో టీవీఎస్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 500పైగా బైకులు దగ్ధం