మారుతికి అమ్మకాల దన్ను

- క్యూ3లో రూ.1,996 కోట్ల లాభం
న్యూఢిల్లీ, జనవరి 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.1,996.70 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. కరోనా సంక్షోభం వల్ల వరుసగా రెండు త్రైమాసికాల్లో నిరాశాజనక పనితీరు కనబరిచిన మారుతి సుజుకీ.. మూడో త్రైమాసికంలో మాత్రం టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. పండుగ సీజన్ కూడా తోడవడం లాభాల్లో రెండంకెల వృద్ధికి దోహదం చేసింది. 2019-20 క్యూ3లో ఆర్జించిన రూ.1,587.40 కోట్లతో పోలిస్తే ఈసారి లాభం 26 శాతం పెరిగింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.23,471.30 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో 4,95,897 యూనిట్ల కార్ల విక్రయాలు జరిపింది. అంతక్రితం ఏడాది విక్రయించిన వాటితో పోలిస్తే 13.4 శాతం అధికం. వీటిలో దేశీయంగా 4,67,369 యూనిట్లను విక్రయించగా, మిగతా వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం