Maruti @ Kamarajar Port | కామరాజర్ పోర్ట్‌తో చేతులు కలిపిన మారుతీ సుజుకీ.. ఏటా 20 వేల కార్ల ఎగుమతికి ఒప్పందం
Maruti @ Kamarajar Port | విదేశాలకు తమ వాహనాలను ఎగుమతి చేసేందుకు మారుతీ సుజుకీ సంస్థ తమిళనాడులోని కామరాజర్ పోర్టుతో ఒప్పందం చేసుకున్నది. ఏటా 20 వేల కార్లను ఎగుమతి చేసేలా ఐదేండ్లకు ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
Maruti @ Kamarajar Port | తమిళనాడులోని కామరాజర్ పోర్టుతో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా చేతులు కలిపింది. ప్రపంచ మార్కెట్‌కు తమ కార్లను ఎగుమతి చేసేందుకు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఐదేండ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. ఆటోమొబైల్ యూనిట్లను దిగుమతి, ఎగుమతి చేసేందుకు కామరాజర్ పోర్ట్ యాజమాన్యం కార్-కమ్-జనరల్ కార్గో బెర్త్‌ను అభివృద్ధి చేసింది.
మారుతీ సుజుకీ కార్లను ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా, ఓషియానియా, సార్క్ దేశాలకు ఎగుమతి చేసేందుకు కామరాజర్ పోర్టు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మారుతీ కార్ల సంస్థ భావించింది. ఈ పోర్ట్ నుంచి ఏటా 20 వేల వాహనాలను ఎగుమతి చేయనున్నట్లు మారుతీ సుజుకీ సంస్థ గురువారం ప్రకటించింది. దేశంలో ఎగుమతుల కోసం కంపెనీకి ఇది నాలుగో పోర్ట్. ప్రస్తుతం మారుతీ సుజుకీ తన వాహనాలను ముంబై, ముంద్రా, పీపావావ్ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నది.
వివిధ దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలుగా తమిళనాడులోని కామరాజర్ పోర్టు సరైందని భావించి ఒప్పందం చేసుకున్నట్లు మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి తెలిపారు. ఈ పోర్టు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లను చేరుకోవడం చాలా ఈజీగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎగుమతులు చేస్తున్న మూడు పోర్టులపై భారం తగ్గించేందుకే కామరాజర్ పోర్టుతో ఒప్పందం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

