న్యూఢిల్లీ, మార్చి 17: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..కాంప్యాక్ట్ ఎస్యూవీ బ్రెజ్జా సీఎన్జీ వెర్షన్ను పరిచయం చేసింది. ఈ మాడల్ రూ.9.14 లక్షల నుంచి రూ.12.05 లక్షల మధ్యలో లభించనున్నది.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన ఈ మాడల్ 25.51 కిలోమీటర్లు/కిలోకు మైలేజీ ఇస్తున్నది.