Covid-19 Challenges | కరోనా సవాళ్లు.. కార్పొరేట్లకు మారుతి చైర్మన్ భార్గవ సూక్తులు.. అవేంటంటే!
Covid-19 Challenges | కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను అధిగమించేందుకు వివిధ కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు వ్యక్తిగతంగా ఖర్చులు ....

Covid-19 Challenges | కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను అధిగమించేందుకు వివిధ కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు వ్యక్తిగతంగా ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉందని మారుతి సుజుకి (ఎంఎస్ఐ) చైర్మన్ ఆర్సీ భార్గవ సూచించారు. అంతర్గతంగా పొదుపు చర్యలు పాటించడం ద్వారా అంతర్గత ఆదాయ వనరులను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకతను కోవిడ్-19 మహమ్మారి నొక్కి చెప్పిందన్నారు. మంగళవారం మారుతి సుజుకి వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో వర్చువల్‌గా మాట్లాడుతూ అంతర్గత వనరులను నిర్మించుకోవడం ప్రాధాన్యం అని మహమ్మారి నిర్దేశించిందన్నారు.
కార్పొరేట్ల ప్రత్యేక తీర్మానాలకు ఇలా..
ఈ నెల ప్రారంభంలో ఎచిర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ్ లాల్‌ను ఎండీగా నియమించుకోవడంతోపాటు రెన్యూమరేషన్ పెంచాలని సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానానికి వాటాదారులు 73 శాతం వ్యతిరేకంగా ఓటేశారు. ఒక కార్పొరేట్ సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానానికి 75 శాతం ఓట్లు అవసరం.ఈ నేపథ్యంలో ఆర్సీ భార్గవ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
నిధుల నిల్వలు ఎందుకు పెంచుకోవాలంటే?
కరోనా నుంచి తలెత్తే ఇబ్బందులను అధిగమించే ఇబ్బందులను అధిగమించడానికి అంతర్గత వనరులను జనరేట్ చేసుకుని నిధుల నిల్వలు పెంచుకోవాలని ఆర్సీ భార్గవ చెప్పారు. ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నుల వల్ల కార్ల కొనుగోళ్లు తగ్గుతున్నాయని, ఈ సమస్యను అధిగమించాల్సి ఉందన్నారు. భారత్‌లో శక్తిమంతమైన పారిశ్రామిక పునాది నిర్మించాలని గట్టిగా విశ్వసిస్తున్నా.. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాల పన్ను పాలసీపై భార్గవ ఇలా
నిధుల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోమొబైల్ సంస్థలపై వన్‌టైం పన్ను స్థానే వార్షిక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయని ఆర్సీ భార్గవ తెలిపారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరారు. ఈ అంశాన్ని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ గుర్తించారని త్వరలోనే తగు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Spondylitis | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు కొత్త తంటా.. పెరుగుతున్న మెల్లకన్ను సమస్యలు
తల్లిదండ్రులకు హెచ్చరిక.. డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా వాడే పిల్లల్లో ఊబకాయం ముప్పు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- maruti suzuki
- rc bhargava
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

