న్యూఢిల్లీ, జనవరి 6: రెండు సీఎన్జీ పవర్ట్రైన్ ఆప్షన్ కలిగిన మధ్యస్థాయి ఎస్యూవీ మోడల్ గ్రాండ్ విటారాను మార్కెట్లోకి విడుదల చేసింది మారుతి సుజుకీ. ఈ కారు రూ.12.85 లక్షలు, రూ.14.84 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నాయి. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన ఈ మోడల్ కిలో సీఎన్జీకి 26.6 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. 1.5 లీటర్ గ్యాసోలైన్ పవర్ కలిగిన మోడల్ రూ.10.45 లక్షల నుంచి రూ.19.45 లక్షల మధ్యలో నిర్ణయించింది.