న్యూఢిల్లీ, జనవరి 23: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..నూతన వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అన్ని రకాల వాహన ధరలను రూ.32,500 వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.
ప్రస్తుతం సంస్థ రూ.3.99 లక్షల ప్రారంభ ధర కలిగిన ఆల్టో కే-10తోపాటు రూ.28.92 లక్షల గరిష్ఠ ధర కలిగిన ఇన్విక్టో మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వాహన ధరల పెంపు ఇలా..