న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల 8 నుంచి మాడల్నుబట్టి కొన్నింటి రేట్లు రూ.2,500ల నుంచి 62,000 వరకు పెరగబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ప్రకటించింది. పెరిగిన తయారీ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు, రెగ్యులేటరీ మార్పులతోపాటు వాహనాల అప్గ్రేడ్ ఫీచర్ల వల్లే ధరలను పెంచాల్సి వస్తున్నట్టు మారుతీ తెలియజేసింది.
నిజానికి వ్యయ భారం కంపెనీపై అధికంగానే ఉన్నప్పటికీ తమ కస్టమర్లపై కొంతమేరకే మోపుతున్నామని కూడా స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్లో ఆల్టో కే-10 మొదలు మల్టీ పర్పస్ వెహికిల్ ఇన్విక్టోదాకా పదికిపైగా మాడళ్లను మారుతీ విక్రయిస్తున్నది. ఈ ఏడాది జనవరిలోనూ ఆయా కార్ల ధరలను రూ.32,500 వరకు పెంచుతున్నట్టు సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
1